టీడీపీ రికార్టు విజయం వెనుక రాబిన్ శర్మ చేసింది ఇదే..! షోటైమ్ స్ట్రాటజీ వెల్లడి..

ఏపీలో ఈసారి టీడీపీ సాధించిన చారిత్రక విజయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఏపీ చరిత్రలో కనీవినీ ఎరుగని స్ధాయిలో టీడీపీ అందుకున్న విజయం వెనుక ఉన్న చోదకశక్తి, వ్యూహకర్త రాబిన్ శర్మ. ఆయన సంస్థ షోటైమ్ కన్సల్టింగ్ ఐదేళ్లుగా టీడీపీ కోసం పడిన శ్రమ ఫలితంగా మారి ఇప్పుడు జాతీయ స్ధాయిలో చర్చకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలో షోటైమ్ సంస్థ టీడీపీ విజయంపై ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో టీడీపీ విజయం వెనుక తమ శ్రమను వెల్లడించింది. 2019 ఎన్నికల్లో 23 సీట్ల పరాజయం తర్వాత చంద్రబాబు తమ పార్టీ టీడీపీని గాడిన పెట్టడానికి షోటైమ్ కన్సల్టింగ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయినా సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవం నుంచి బయటపడేందుకు ఆ పార్టీకి చాలా సమయమే పట్టింది. స్థానిక సంస్థల ఎన్నికలు, ఉపఎన్నికలు ఇలా వరుస పరాజయాలు వెంటాడాయి. ఓ దశలో రాబిన్ శర్మ పనితీరుపైనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత పరిస్ధితులు వేగంగా మారాయి.

https://telugu.oneindia.com/news/andhra-pradesh/robin-sharmas-showtime-consulting-reveals-how-they-engineered-victory-for-tdp-390449.html